
విద్యా బుద్ధులతో భావి పౌరులుగా ఎదగాలి
- విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల్ల
గట్టు (సెప్టెంబర్ 07): గట్టు మండల కేంద్రంలో ఆదివారం ఉచిత ట్యూషన్ సెంటర్ ను విశ్వ మానవ సంక్షేమ సంఘం మరియు తెలంగాణ బాలోత్సవం కమిటి ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్ సెంటర్ ను విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల, తెలంగాణ బాలోత్సవము రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ దుర్గే ప్రారంభించారు. ఈ సందర్బంగా మస్తాన్ రావు పెసల మాట్లాడుతూ ప్రపంచంలోనే మానవులు సంక్షేమంగా ఉండాలని భావం వ్యక్తం చేశారు. పేద, నిరుపేద పిల్లలకు చదువు నేర్పించి వాళ్లను ఉన్నతులుగా తయారు చేయాలని, అయితేనే దేశం అభివృద్ధి అవుతుందన్నారు. విశ్వ మానవ సంక్షేమ సంఘం ప్రధాన ఉద్దేశం మానవ సంక్షేమ ప్రపంచాన్ని సి ష్టించడమన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాలని గట్టు మండలం వెనకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో విద్య అభివృద్ధి చెందాలని, బాల బాలికలు మంచిగా చదువుకొని ఉన్నత పౌరులుగా ఎదగాలని అన్నారు. మంచి లక్షణాలను అవలంబించుకొని మేధావులుగా ఎదగాలని ఆక్షించారు. రాబోయే భవిష్యత్తులో ఈ ఉచిత ట్యూషన్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్యూషన్ సెంటర్ ఉపాధ్యాయురాలు నర్మద మాట్లాడుతూ దేశంలోనే అత్యంత వెనుకబడిన మండలం గట్టు మండలములోని తెలిపారు. ఇక్కడ నేటికీ విద్య, వైద్యం అందుబాటులో లేదని వాపోయారు. బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి వ్యవస్థ తో వెనకబడ్డారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల నుండి బయట పడాలంటే విద్యనందించడం ప్రధాన లక్ష్యంగా ఈ ట్యూషన్ ప్రారంభిస్తున్నామన్నారు. 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక విద్యార్థులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ, మండల పెద్దలు, అధికారులు సహాకరించాలని కోరారు.
