చెడు అలవాట్లు అలవాటు చేసుకోకండి – చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకండి – మస్తాన్ రావు పెసల
తేదీ:16/09/2025
విశ్వ మానవ సంక్షేమ సంఘం సహకారంతో గుంటూరు చిల్డ్రన్ క్లబ్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో స్వర్ణాంధ్ర నగర్ 57వ, పుచ్చలపల్లి సుందరయ్య నగర్ 58వ, ప్రగతి నగర్ 59వ మరియు పాత గుంటూరులో 60వ ట్యూషన్ సెంటర్లు ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో 60 ట్యూషన్ సెంటర్లు స్టార్ట్ చేసింది. హైదరాబాద్, మెదక్, ఇబ్రహీంపట్నం మండలంలో, యాచారం మండలంలో, వైజాగ్, విజయవాడ, గుంటూరు, చీరాల, ఉయ్యూరులలో మొదలు పెట్టారు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలను ఉన్నతమైన పౌరులుగా తీర్చి దిద్దాలని విశ్వ మానవ సంక్షేమ సంఘం యొక్క ప్రధాన ఉద్ధేశం. ఈ ప్రారంభోత్సవాలలో విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల మరియు గుంటూరు చిల్డ్రన్ క్లబ్ కమిటీ మెంబర్ షేక్ ఖాశిం షహీద్ పాల్గొన్నారు. విశ్వ మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల మాట్లాడుతూ సమాజంలో విలువలు పడిపోతున్నాయని, దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మోసాలు, రాజకీయ నాయకుల మోసాలు, ప్రభుత్వ ఉద్యోగుల మోసాలు పెరిగి పోతున్నాయని, లంచగొండి తనం పెరిగి పోతుందని సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విశ్వ మానవ సంక్షేమ సంఘం యొక్క ఉద్ధేశం పిల్లలలో విద్యార్థి దశ నుంచే నైతిక విలువలు, పచ్చదనం, పరిశుభ్రత, క్రమశిక్షణ, సమయ పాలన, భారతీయ సంస్కృతి పట్ల అవగాహన ఏర్పరచాలని చెప్పారు. పిల్లలతో మాట్లాడుతూ గాంధీ, నెహ్రూ, పటేల్, శాస్త్రి, ప్రకాశం పంతులు, వావిలాల గోపాల కృష్ణయ్య, రాజేంద్ర ప్రసాద్, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, దామోదరం సంజీవయ్య లాంటి దేశభక్తుల, త్యాగధనుల యొక్క చరిత్ర చదవాలని చెప్పారు. అలాగే ప్రముఖ శాస్త్రవేత్తలు ఐనస్టీన్, ఎడిసన్, C V రామన్, సుబ్రమణ్యం చంద్రశేఖర్ లాంటి శాస్త్ర వేత్తలు ఈ ప్రపంచానికి వెలుగు నిచ్చిన, అభివృధి దోహద పడిన శాస్త్రవేత్తల గురించి చదవాలని చెప్పారు. గాంధీ లాగా ఎప్పుడూ సత్యాన్ని పలకాలని, వాస్తవమే మాట్లాడాలని, ధర్మము, న్యాయం కాపాడాలని, దొంగతనాలు చేయ కూడదని, ఈ రోజు చాలా మంది మోసాలకు అలవాటు పడ్డారని మోసాలు చేయవద్దని, చిన్నపడినుండే మంచి అలవాట్లు నేర్చుకొని, పెద్దయిన తరువాతకూడా కొనసాగించించాలని చెప్పారు. మంచి పౌరులే దేశానికి రక్షా అని చెప్పారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య కొటేషన్ ‘ మంచి దేశం నిర్మాణం జరగాలంటే ముందు మంచి నడవడిక, క్రమశిక్షణ, సమయపాలన , ఉన్నతమైన లక్షణాలుగల పౌరులను తయారు చేయమంటారు. ఉన్నత మైన పౌరులే ఉన్నతమైన సమాజానికి, దేశానికి పునాదులని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర నగర్, పుచ్చలపల్లి సుందరయ్య నగర్, ప్రగతి నగర్ పాత గుంటూరు ట్యూషన్ టీచర్లు శిరీష, కె సుజాత, ప్రభు కుమార్, తమిమ్ జానీ మరియు నిర్వాహకులు ఆది నికల్సన్, జి లూధర్ పాల్, పఠాన్ భాషా తదితరులు పాల్గొన్నారు.
షేక్ ఖాసిం షహీద్
గుంటూరు చిల్డ్రన్స్ క్లబ్
