
Birth anniversaries of Mahatma Gandhi and Lal Bahadur Shastri celebrated under the auspices of the World Human Welfare Association
2-10-2025 , October, 2 వ తేదీ విశ్వ మానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతోత్సవాలు czech కాలనీ గాంధీ పార్కులో సాయంత్రం 5.30 కి జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సోమా వెంకట్, వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల, ముఖ్య అతిథిగా ch. అనంత రెడ్డి గారు, గౌరవ అతిథులు గా Dr. మల్లు ప్రసాద్ గారు మరియు విశ్వనాథ రాజు గారు, తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి somaiah గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో smt., నందిరాజు రాజ రాజేశ్వరి గారు రాసిన ‘ మహానుభావులు ‘ అనే పుస్తకాన్ని సుబ్బరాజు గారు ఆవిష్కరించారు. అధ్యక్షులు సోమా వెంకట్ మాట్లాడుతూ మా సంస్థ 1987 లో స్థాపించబడి 38 సంవత్సరాలుగా సేవ చేస్తున్నామని చెప్పారు. మేము మురికి వాడలలో ఆంధ్రా , తెలంగాణా రాష్ట్రాలలో 62 tuition సెంటర్లు నడుపుతున్నామని చెప్పారు. ఈ సెంటర్లలో పిల్లలకి చదువుతోటి నైతిక విలువలు, క్రమశిక్షణ, సమయపాలన, మానవత్వము, భారతీయ సంస్కృతి అన్ని నేర్పిస్తున్నామని చెప్పారు. అవే కాకుండా స్వచ్ భారత్, ట్రాఫిక్ awareness ప్రోగ్రాములు చేస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం మొత్తం 100 సెంటర్లు చేస్తామని చెప్పారు. వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల మాట్లాడుతూ గాంధీ గారు ప్రపంచానికి శాంతిని బోధించారని, అహింస తోటి బ్రిటిష్ వారి మీద పోరాడారని చెప్పారు. గాంధీ గారు 1915 లో దక్షిణ ఆఫ్రికా నుండి భారత వచ్చారని, అంతకుముందు స్వాతంత్ర్యము ఝాన్సీ లక్ష్మీ భాయ్, అల్లూరి సీతారామరాజు, వీర పాండ్య కట్టబొమ్మన్న లాంటి వారు ప్రాంతీయంగా పోరాడారని , గాంధీ గారు భారత్ వచ్చిన తరువాత గోపాల కృష్ణ గోఖలే గారి సలహా మేరకు భారత దేశమంత తిరిగి స్వాతంత్రోద్యామాన్ని ఒక తాటిపైకి తెచ్చారని చెప్పారు. నెల్సన్ మండేలా, ఒబామా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఐన్స్టీన్, దలైలామా, ప్రకాశం పంతులు, వావిలాల గోపాల కృష్ణయ్య, రాజేంద్ర ప్రసాద్, పటేల్, నెహ్రూ, తిలక్, గోఖలే, పొట్టి శ్రీరాములు లాంటి వారెందరో గాంధీ గారి వలన ప్రేరణ పొంది, ఆయనను అనుసరించారని చెప్పారు. మల్లు ప్రసాద్ గారు మాట్లాడుతూ విశ్వ మానవ సంక్షేమ సంఘం మురికి వాడలలో ఎక్కువగా బీసీలు , SC, ST లు ఉన్నచోట ఎక్కువగా ఇవి ప్రారంభించారని చెప్పారు. 38 సంవత్సరాల నుండి ఒక సంస్థను నడపటం ఎంతో కాస్త సాధ్యమని చెప్పారు. సోమయ్య గారు మాట్లాడుతూ విశ్వ మానవ సంక్షేమ సంఘం మరియు మా బాలోత్సం ఆశయాలు ఒకటేనని , అందుకనే మా రెండు సంస్థలు కలిసి ట్యూషన్ సెంటర్లు ను నడుపుతున్నామని , మేము వీటిని విస్తరిస్తామని చెప్పారు. ఈ రోజు చేతబడులు లాంటి మూఢనమ్మకాలు ముఖ్యంగా పల్లెలో పెరుగుతున్నాయని , మనమందరం కలిసి విద్యార్థులను చైతన్యం చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ముఖ్య అతిధి అనంత రెడ్డి గారు ఈ సంస్థ ఎంతో కష్టపడి ట్యూషన్ సెంటర్లు నడుపుతున్నారని, ఈ విద్యార్థులలో కొంత మంది అయిన IPS, IAS, engineering లాంటి కోర్సులు చదివి ఉన్నతమైన వారు అవుతారని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీమతి రాజ రాజేశ్వరి గారు వ్రాసిన ‘ మహానుభావుల అనే పుస్తకము సుబ్బరాజు గారి ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో గాంధీ, నెహ్రూ, తిలక్, గోఖలే, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, దామోదరం సంజీవయ్య లాంటి స్వతంత్ర సమరయోధులు, ఐన్స్టీన్, ఎడిసన్, CV Raman, లాంటి వారి చరిత్రలు, మంచి నీతి కథలు ఉన్నాయని చెప్పారు. నేను కూడా ఈ సంస్థ కు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు. పుస్తక రచయిత్రి రాజ రాజేశ్వరి గారు మాట్లాడు ఎన్నో పుస్తకాలు, ఇంటర్నెట్లో శోధించి మాటర్ అంత సేకరించానని, ఏమైనా తప్పుకుంటే తెలియ చెప్పాలని తెలియ చేశారు. ఈ సందర్భంలోనే మాజీ కార్పొరేటర్ సదాని జింఖానా క్లబ్ కమిటీ సభ్యులైనందుకు, శివ రెడ్డి గారు 50 సంవత్సరాలు సర్వీస్ చేసి రెండురోజుల క్రితం రిటైర్ అయినందుకు సత్కరించారు.