
పేదరికం పోవాలంటే ఏం చేయాలి?
ప్రతి ఒక్కరు కూడా నీతి, నిజాయితీతో, న్యాయ బద్ధమైన సంపాదనను పెంచుకోవాలి.
ప్రతి ఒక్కరు కూడా వృధా ఖర్చులను తగ్గించుకోవాలి. త్రాగుడు, వ్యభిచారము, చీట్లపేక, గంజాయి , మత్తు పదార్థాలు , బెట్టింగ్, on-line గేమ్స్ లాంటివి అన్ని పూర్తిగా మాని వేయాలి. ఎంతో మంది ఆర్ధికంగా దెబ్బతిని భార్య, బిడ్డలను చంపి తాము కూడా ఆత్మహత్యలు చేసుకున్నవారు కోకొల్లలు. పేదరికము భయంకరమైనది. వేరే వారి మెప్పు కోసం అనవసరపు ఆడంబరాలకు పోకండి.
సంపాదన అన్నది మన చేతుల్లో లేదు. అనుకున్నది రావచ్చు, రాక పోవచ్చు. కానీ ఖర్చు మన చేతుల్లో ఉంది.
పేద వారి ఉత్పత్తులను కొనుగోలు చేయండి, ప్రోత్సహించండి.
